Stock Market: ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ సూచీ ఏకంగా 250 పాయింట్ల మేర నష్టపోయింది. నేడు మార్కెట్లో ప్రధానంగా ఐటీ, బ్యాంకింగ్, రియల్టీ రంగాలకు చెందిన షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

మార్కెట్ సూచీలు..
ఉదయం 9.40 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 139 పాయింట్ల నష్టంలో కొనసాగుతోంది. ఇదే సమయంలో నిఫ్టీ సూచీ 38 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 195 పాయింట్ల నష్టంలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ సైతం 80 పాయింట్ల మేర నష్టపోయింది. అయితే FIIలు భారత మార్కెట్లలోకి తమ పెట్టుబడులను మళ్లించటం కొనసాగిస్తున్నారు.

US మార్కెట్లు..
అగ్రరాజ్యం అమెరికాలో ద్రవ్యోల్బణం ఇంకా ప్రమాదకర స్థాయిల్లోనే కొనసాగుతోంది. అయితే ఈసారి ఫెడ్ ఛైర్మన్ వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్ల మేర పెంచవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి తోడు నిరుద్యోగుల డేటా ప్రకారం అవి పెరుగుతున్నట్లు వెల్లడైంది. ఈ సంకేతాల నేపథ్యంలో యూఎస్ మార్కెట్లతో పాటు ప్రపంచ మార్కెట్లు సైతం ప్రతికూలంగా ప్రభావితం అవుతున్నాయి.

టాప్ గెయినర్స్..
NSE సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్, హీరో మోటొకార్ప్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, ఎల్ అండ్ టి, బీపీసీఎల్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, యూపీఎల్, హిందాల్కొ, అదానీ ఎంటర్ ప్రైజెస్, టైటాన్, రిలయన్స్, హిందుస్థాన్ యూనీలివర్, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, మారుతీ, భారతీ ఎయిర్ టెల్, కోల్ ఇండియా కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.

టాప్ లూజర్స్..
సూచీలోని నెస్లే, సిప్లా, విప్రో, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, అపోలో హాస్పిటల్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ బ్యాంక్, దివీస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బ్రిటానియా, ఓఎన్జీసీ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా నిలిచాయి.
More From GoodReturns

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications