Stock Market: భారత మార్కెట్లకు యూఎస్ ద్రవ్యోల్బణం దెబ్బ.. నష్టాల్లో ట్రేడవుతున్న కీలక సూచీలు..
Stock Market: ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. నిన్న మంచి లాభాలతో ముగిసిన మార్కెట్లపై యూఎస్ ఎఫెక్ట్ కనిపిస్తోంది.
ఇన్వెస్టర్లు సైతం మార్కెట్లలోని పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

మార్కెట్ సూచీలు..
ఉదయం 9.40 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 268 పాయింట్ల నష్టంలో ట్రేడవుతుండగా.. మరో బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ 71 పాయింట్లు కోల్పోయింది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 181 పాయింట్ల నష్టంలో ట్రేడ్ అవుతోంది. కేవలం నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రమే స్వల్పంగా 35 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది.

యూఎస్ గణాంకాలు..
అమెరికాలో ద్రవ్యోల్బణం నిపుణుల అంచనాలను తలకిందులు చేసింది. ఈ గణాంకాలు ప్రకారం ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగింది. దీంతో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఈ సారి కూడా తన దూకుడును కొనసాగిస్తుందని వాల్ స్ట్రీట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ ప్రభావం ఆసియాతో పాటు ప్రపంచ మార్కెట్లపై పడింది.

టాప్ గెయినర్స్..
NSE సూచీలో ఐషర్ మోటార్స్, అదానీ ఎంటర్ ప్రెజెస్, రిలయన్స్, అపోలో హాస్పిటల్స్, మారుతీ, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్ టెల్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ, హిందాల్కొ, గ్రాసిమ్, దివీస్ ల్యాబ్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్ స్టాక్స్ లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.

టాప్ లూజర్స్..
ఇదే క్రమంలో హిందుస్థాన్ యూనీలివర్, ఎల్ అండ్ టీ, సన్ ఫార్మా, ఓఎన్జీసీ, బ్రిటానియా, హెచ్డీఎఫ్సీ, సిప్లా, ఎస్బీఐ లైఫ్, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్, టీసీఎస్, బీపీసీఎల్, నెస్లే, ఇండస్ ఇండ్ బ్యాంక్, విప్రో, యాక్సిస్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

బంగారం ధరలు..
ద్రవ్యోల్బణం తగ్గటానికి బదులు పెరగటంతో యూఎస్ సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీ రేట్లు పెంచవచ్చని తెలుస్తోంది. దీంతో గోల్డ్ ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇన్వెస్టర్లు తమ డబ్బును బాండ్ మార్కెట్లోకి మళ్లిస్తున్నారు.. కాబట్టి గోల్డ్ నుంచి చాలా మంది ఇన్వెస్టర్లు తమ డబ్బును డెట్ మార్కెట్లోకి తరలిస్తున్నారు. ఈ క్రమంలో బంగారం ధరలు మరింతగా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Click it and Unblock the Notifications