Stock Markets: మార్కెట్లపై అలుముకున్న ఐటీ నీలినీడలు.. అమెరికా నత్తనడక ఆందోళనలు..
Stock Markets: ఐటీ స్టాక్స్ బలహీనమైన ప్రదర్శన దేశీయ స్టాక్ మార్కెట్లపై పడింది. వారాంతంలో మార్కెట్ సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అయితే మార్కెట్లలో స్మాల్ క్యాప్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఉదయం 10.28 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 67 పాయింట్ల నష్టంలో ఉండగా.. నిఫ్టీ సూచీ 6 పాయింట్ల నష్టంలో కొనసాగుతోంది. ఇదే సమంయలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 137 పాయింట్లు నష్టంలో ట్రేడింగ్ అవుతోంది. అయితే మిడ్ క్యాప్ సూచీ మాత్రం 142 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది.

ప్రధానంగా మార్కెట్లపై ఐటీ రంగం లాభాల క్షీణత కొంతమేర ప్రభావం చూపుతోంది. ఇదే సమయంలో అమెరికా వృద్ధి మెుదటి త్రైమాసికంలో నెమ్మదించినట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. అనుకున్నదాని కంటే తక్కువ జీడీపీకి డిమాండ్ తగ్గటంతో పాటు దీనికి అనుగుణంగా కంపెనీలు ఉత్పత్తిని తగ్గిచటం కూడా కారణంగా నిపుణులు చెబుతున్నారు. వడ్డీ రేట్లు అధికంగా ఉండటంతో కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలను సైతం తాజాగా వాయిదా వేసుకున్నాయని నిపుణులు చెబుతున్నారు.
NSE సూచీలోని అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, విప్రో, హెచ్డీఎఫ్సీ లైఫ్, అపోలో హాస్పిటల్స్, సన్ ఫార్మా, హీరో మోటార్స్, బ్రిటానియా, యూపీఎల్, ఎల్ టి, రిలయన్స్, ఎయిర్ టెల్, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, టీసీఎస్, నెస్లే, ఐషర్ మోటార్స్, కోల్ ఇండియా, హిందాల్కొ, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.
సూచీలోని యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, హిందుస్థాన్ యూనీలివర్, ఏషియన్ పెయింట్స్, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, కోటక్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, బిపిసిఎల్, సిప్లా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, గ్రాసిమ్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications