Market Update: వారం ప్రారంభంలో బేజారిన మార్కెట్లు.. ఎందుకీ నష్టాలు..?
Market Update: ఈ రోజు భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దీనికి అమెరికా మార్కెట్ల నష్టాలే కారణంగా నిలుస్తున్నాయి. గత శుక్రవారం వెలువడ్డ ఉద్యోగ నియామక గణాంకాలు బహిర్గతం కావటంతో ఇన్వెస్టర్లు జాగ్రత్తపడటం మెుదలుపెట్టారు. మరో పక్క రష్యా యుద్ధ తంత్రంలో కీలక మార్పులు చేయటం అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.

నష్టాల్లో సూచీలు..
మార్కెట్ సూచీలు ఉదయం భారీ నష్టాల్లో మెుదలైనప్పటికీ మెల్లగా కోలుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఉదయం 11.51 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 459 పాయింట్లు నష్టపోగా, మరో బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ 150 పాయింట్ల నష్టాల్లో ఉంది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 227 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 310 పాయింట్లను కోల్పోయింది.

తగ్గుతున్న చమురు ధరలు..
చైనాలోని తయారీ రంగం భారీగా క్షీణించటం, ఒపెక్ దేశాల తాజా నిర్ణయం, రష్యాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ డిమాండ్ భారీగా తగ్గింది. దీనివల్ల చమురు ధరలు భారీగా క్షీణించాయి. ఈ క్రమంలో బ్యారెల్ చమురు ధర 92 డాలర్లకు చేరుకుంది. అయితే వీటికి తగినట్లుగా దేశంలోని ప్రజలకు ఉపశమనం లభిస్తుందా అని సామాన్యులు ఎదురుచూస్తున్నారు.

గెయినర్స్..
ఈ క్రమంలో యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, పవర్ గ్రిడ్, మారుతీ, ఎన్టీపీసీ, కోల్ ఇండియా స్టాక్స్ మాత్రం ఈ సమయంలో లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. అనేక రంగాలకు చెందిన స్టాక్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

లూజర్స్..
నిఫ్టీ సూచీలోని టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్, టాటా కన్జూమర్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, ఎల్అండ్ టీ, అపోలో హాస్పిటల్స్, హెచ్డీఎఫ్సీ, దివీల్ ల్యాబ్, రిలయన్స్, హిందాల్కోతో పాటి ఇతర స్టాక్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications