Stock Market: ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకుల్లో తమ కొత్త వారాన్ని ప్రారంభించాయి. ఉదయం మార్కెట్ ఆరంభంలో కీలక సూచీలు స్వల్పంగా లాభాలతో ఫ్లాట్ గా ప్రారంభమైనప్పటికీ.. కొద్ది నిమిషాలకే అవి ఆవిరయ్యాయి. దీంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి.

కీలక సూచీలు..
ఉదయం 9.27 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 107 పాయింట్లు, మరో కీలక మార్కెట్ సూచీ నిఫ్టీ 15 పాయింట్ల నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 51 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 106 పాయింట్ల నష్టంలో కొనసాగుతున్నాయి.

కారణాలు ఇవే..
ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ ఫలితాలు దేశీయ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ట్రేడర్లు సైతం స్పష్టమైన సంకేతాలు రాకపోవటంతో వేచిచూస్తున్నారు. అయితే ఈ క్రమంలో చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు లాభాలను బుక్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరో పక్క క్రూడ్ ధరలు సైతం తగ్గుతున్నాయి. దీనికి తోడు ద్రవ్యోల్బణం డేటా విడుదలపై మార్కెట్ వర్గాలు వేచిచూస్తున్నాయని తెలుస్తోంది.

టాప్ గెయినర్స్..
NSE సూచీలో టైటాన్, ఐషర్ మోటార్స్, టాటా స్టీల్, హిందాల్కొ, జేఎస్డబ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డీస్, యూపీఎల్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, కోటక్ బ్యాంక్, ఓఎన్జీసీ, ఎల్అండ్ టీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఆటో, అపోలో హాస్పిటల్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, సన్ ఫార్మా కంపెనీలు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా కొనసాగుతున్నాయి.

టాప్ లూజర్స్..
ఇదే క్రమంలో సూచీలోని ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, విప్రో, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్డీఎఫ్సీ, హెచ్సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, బ్రిటానియా, టాటా మోటార్స్, హిందుస్థాన్ యూనీలివర్, ఎస్బీఐ, కోల్ ఇండియా, దివీస్ ల్యాబ్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, సిప్లా, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ కంపెనీల షేర్లు మాత్రం నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.
More From GoodReturns

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications