Stock Market: ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ప్రధానంగా యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు కొనసాగుతుందని చేసిన ప్రకటన అమెరికా మార్కెట్లతో పాటు ఇటు ఇండియా స్టాక్ మార్కెట్లనూ తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ వార్తల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు సైతం తమ డబ్బును మన మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకుంటున్నారు.

మార్కెట్ సూచీలు..
ఉదయం 9.51 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 107 పాయింట్లు, నిఫ్టీ సూచీ 52 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ సూచీ 167 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 55 పాయింట్ల నష్టంలో ట్రేడవుతున్నాయి. ఈరోజు ప్రారంభంలో స్టాక్ మార్కెట్ సూచీలు మరింతగా నష్టాలను నమోదు చేశాయి.

టాప్ గెయినర్స్..
NSE సూచీలో బజాజ్ ఫిన్ సర్వ్, ఎల్ అండ్ టీ, ఎస్బీఐ లైఫ్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, దివీస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్, బ్రిటానియా, నెస్లే, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, టీసీఎస్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.

టాప్ లూజర్స్..
సూచీలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, హీరో మోటార్స్, టాటా మోటార్స్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఆటో, మారుతీ, యూపీఎల్, భారతీ ఎయిర్ టెల్, సిప్లా, విప్రో, కోటక్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, బీపీసీఎల్, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, హిందాల్కొ, టాటా స్టీల్ కంపెనీలు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.

నీరసించిన అదానీ స్టాక్స్..
ఈ వారం కొంత కోలుకుని లాభాల్లోకి వచ్చిన అదానీ స్టాక్స్ మళ్లీ డీలా పడ్డాయి. ప్రధానంగా అధానీ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ మార్కెట్ ప్రారంభంలో దాదాపుగా 15 శాతం నష్టపోయింది. దీనికి తోడు అదానీ గ్రీన్స్ 4.3 శాతం, అదానీ పోర్ట్స్ 7.1 శాతం, అదానీ పవర్ 5 శాతం, అదానీ ట్రాన్స్ మిషన్ 5 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 5 శాతం, అదానీ విల్మర్ 2.1 శాతం మేర నష్టపోయి గ్రూప్ కంపెనీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక సిమెంట్ కంపెనీసు ఏసీసీ స్టాక్ 2.2 శాతం మేర నష్టపోగా.. అంబుజా సిమెంట్స్ స్టాక్ 5.06 శాతం నష్టాల్లో కొనసాగుతున్నాయి.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications