Fed Effect: ఒక్కరోజే రూ.3 లక్షల కోట్లు పోగొట్టుకున్న ఇన్వెస్టర్లు.. నేడు నీరసంగానే మార్కెట్లు..
Stockk Market: ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఎదురుచూసింది నిన్న యూఎస్ ఫెడ్ మాట కోసమే. అయితే ఈ వార్త సృష్టించిన కల్లోలం విలువ అక్షరాలా రూ.3 లక్షల కోట్లు. ఫెడ్ రేట్ల పెంపుకు బ్లేకులు వేసే పరిస్థితి లేదని తెలియటంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారు. వచ్చే ఏడాది చివరి నాటికి ఫెడ్ వడ్డీ రేటు పెంపు 5.1 శాతానికి పెరుగుతుందని తెలుస్తోంది. ఈ క్రమంలో బీఎస్ఈ సూచీ మార్కెట్ క్యాప్ 3 లక్షల కోట్ల రూపాయలు డిసెంబర్ 15న ఆవిరైపోయింది. అమెరికా ఫెడ్ ప్రకటన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లలో మాంద్యం భయాలు మరింతగా పెరగిపోయాయి.

నేడు సూచీలు..
భారత మార్కెట్లపై ఫెడ్ ప్రభావం నేడు కూడా కనిపిస్తోంది. ఆరంభం నుంచి కీలక బెంచ్ మార్క్ సూచీలు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఉదయం 10.10 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 213 పాయింట్లు, నిఫ్టీ సూచీ 72 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 265 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 385 పాయింట్ల మేర నష్టాల్లో కొనసాగుతున్నాయి. వారాంతంలో మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

టాప్ గెయినర్స్..
రిలయన్స్, ఎల్ అండ్ టీ, సిప్లా, పవర్ గ్రిడ్, ఐషర్ మోటార్స్, హిందుస్థాన్ యూనీలివర్, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్ టెల్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్, దివీస్ ల్యాబ్స్ కంపెనీల షేర్లు మాత్రమే ఈ క్రమంలో ఎన్ఎస్ఈ సూచీలో టాప్ గెయినర్స్ గా కొనసాగుతున్నాయి.

టాప్ లూజర్స్..
బీపీసీఎల్, హిందాల్కొ, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, విప్రో, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఆటో, టీసీఎస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హీరో మోటొకార్ప్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, అపోలో హాస్పిటల్, ఐటీసీ, గ్రాసిమ్, డాక్టర్ రెడ్డీస్, యూపీఎల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ కంపెనీల షేర్లు ఈ క్రమంలో ఎన్ఎస్ఈ సూచీలో నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.


Click it and Unblock the Notifications