Stock Market: మార్కెట్ల చూపు Chandrayaan వైపు.. స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సూచీలు..
Stock Market: నిన్న లాభాలు ఆవిరై ఫ్లాట్ ముగింపును చూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ప్రయాణాన్ని మెుదలు పెట్టాయి. ఇదే క్రమంలో అమెరికా, ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉండటం సూచీలను ప్రధానంగా ప్రభావితం చేస్తోంది.
ఉదయం 9.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 6 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి ఇంట్రాడేలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 9 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 154 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో కీలక సూచీలు ఫ్లాట్ ప్రారంభాన్ని చూశాయి. అయితే ప్రపంచం మెుత్తం భారత చంద్రయాన్ లాండింగ్ వైపు చూస్తోంది. దేశీయ ఇన్వెస్టర్లు సైతం దీని సక్సెస్ కోసం వేచిచూస్తున్న ధోరణి మార్కెట్లలో నేడు కనిపిస్తోంది.

అంబానీకి చెందిన ఫైనాన్స్ కంపెనీ జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ వరసగా మూడో రోజు కూడా మార్కెట్లో డీలా పడింది. దీంతో షేర్ లిస్టింగ్ రోజు నుంచి ఏకంగా 15 శాతం నష్టాన్ని నమోదు చేసింది. వరుసగా మూడో రోజు మార్కెట్లో టాప్ లూజర్ల జాబితాలో మెుదటి స్థానంలో నిలిచింది. దీంతో ఇన్వెస్టర్లు కొంత ఆందోళన చెందుతున్నారు.
ఎన్ఎస్ఈలో సిప్లా, హిందాల్కొ, అదానీ పోర్ట్స్, ఎల్ టిఐఎమ్, దివీస్ ల్యాబ్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా స్టీల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, నెస్లే, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, అపోలో హాస్పిటల్స్, ఎస్బీఐ లైఫ్, ఎల్ టి, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, ఓఎన్జీసీ, టీసీఎస్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో జియో ఫైనాన్సియల్, సన్ ఫార్మా, ఎయిర్ టెల్, టాటా కన్జూమర్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సై లైఫ్, ఐసీఐసీఐ బ్యాంక్, కోల్ ఇండియా, ఐటీసీ, కోటక్ బ్యాంక్, విప్రో, హీరో మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications