Stock Market: దిమ్మతిరిగే లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. అమెరికాలో ఆ డేటా రిలీజ్ కావటంతో..
Stock Market: అమెరికా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలతో దేశీయ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. వరుస నష్టాలకు సూచీలు బ్రేక్ వేశాయి. దాదాపు 5 నెలల కనిష్ఠానికి దిగజారిన సూచీలు మళ్లీ పుంజుకుంటున్నాయి.

మార్కెట్ సూచీలు..
ఉదయం 9.15 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 558 పాయింట్లు, నిఫ్టీ 166 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ 489 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 291 పాయింట్ల మేర లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రధానంగా అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియటంతో ఆసియాలోని అన్ని దేశాల మార్కెట్లు గ్రీన్ లో ట్రేడ్ అయ్యాయి.

అమెరికా డేటా..
యూఎస్ తాజా ద్రవ్యోల్బణం డేటా సానుకూలంగా ఉండటంతో అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇదే క్రమంలో అమెరికా బ్యాంకింగ్ రంగంలో ఏర్పడిన సంక్షోభంపై ఆందోళనలు తగ్గాయి. వచ్చే వారం యూఎస్ సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ సమావేశంలో రేట్ల పెంపు చాలా స్వల్పంగా ఉండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో అమెరికాతో పాటు ఆసియా మార్కెట్లు సానుకూలంగా ట్రేడింగ్ ముగించాయి.

టాప్ గెయినర్స్..
సూచీలోని అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, హిందాల్కొ, టైటాన్, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యూపీఎల్, మారుతీ, ఎల్ టి, బజాజ్ ఫిన్ సర్వ్, కోటక్ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటార్స్, అపోలో హాస్పిటల్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.

టాప్ లూజర్స్..
ఎన్ఎస్ఈ సూచీలోని భారతీ ఎయిర్ టెల్, ఎస్బీఐ లైఫ్, సన్ ఫార్మా, ఓఎన్జీసీ కంపెనీల షేర్లు మాత్రమే నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.


Click it and Unblock the Notifications