Stock Market: వారాంతంలో భారీ నష్టాలు.. సూచీల నేల చూపులు.. నిండా మునిగిన IT స్టాక్స్..
Stock Market: వారం చివరి రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ ఓలటాలిటీతో ప్రారంభమయ్యాయి. మార్కెట్లు లాభాల్లో నడిచేందుకు ఎలాంటి దన్ను దొరకకపోవటంతో బేర్లు తమ సత్తాను కొనసాగించారు. దీంతో ఇన్వెస్టర్లకు చెందిన లక్షల కోట్ల సంపద ఆవిరైంది. మెుత్తానికి కొత్త సంవత్సరం తొలి వారం రెండు రోజులు మినహా మార్కెట్లు నేల చూపులకు పరిమితం అయ్యాయి.

మార్కెట్ సూచీలు..
మధ్యాహ్నం 2.20 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 664 పాయింట్ల నష్టంలో కొనసాగుతోంది. ఇదే సమయంలో మరో కీలక సూచీ నిఫ్టీ 190 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ సూచీ 715 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 338 కోట్ల నష్టంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కొత్త ఏడాది అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సంకేతాల కోసం ఆసియా మార్కెట్లు ఎదురుచూస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత నష్టాలు ఇందులో భాగమని తెలుస్తోంది.

టాప్ గెయినర్స్..
మధ్యాహ్నం 2.20 గంటల సమయంలో బ్రిటానియా, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్, ఓఎన్జీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్, బీపీసీఎల్, బజాజ్ ఆటో, ఐటీసీ, నెస్లే ఇండియా కంపెనీ షేర్లు మాత్రమే లాభంలో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా ఎన్ఎస్ఈ సూచీలో ఉన్నాయి.

టాప్ లూజర్స్..
ఇదే సమంయోల టీసీఎస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, కోల్ ఇండియా, టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, హెచ్సీఎల్ టెక్, విప్రో, ఏషియన్ పెయింట్స్, మారుతీ, గ్రాసిమ్ కంపెనీల షేర్లు మాత్రం నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా నిలిచాయి.


Click it and Unblock the Notifications