Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రధాన సూచీలు ఒక్కసారిగా ఎరుపెక్కాయి. దలాల్ స్ట్రీట్ ప్రస్తుతం బేర్స్ హస్తగతమైనట్లు తెలుస్తోంది. భారత స్టాక్ మార్కెట్ ఈరోజు ప్రారంభ ట్రేడింగ్ సమయంలోనే భారీగా పతనమైంది. సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా పతనమై ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చింది.

మార్కెట్ సూచీలు..
ఉదయం 9.54 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 471 పాయింట్ల మేర నష్టపోయింది. ఇదే క్రమంలో మరో కీలక సూచీ నిఫ్టీ 144 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ 306 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 219 పాయింట్ల మేర నష్టపోయాయి. ఉదయం ఆరంభంలోనే పతనంలో ప్రయాణం మెుదలుపెట్టిన సూచీలు సమయం గడిచే కొద్దీ మరింత క్షీణిస్తున్నాయి. ఇన్వెస్టర్లు సైతం ఆచితూచి ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది.

సెంటిమెంట్ ప్రభావమా..?
అమెరికా మార్కెట్లు నిన్న నష్టాల్లో ముగియటం వల్ల ఆ ప్రభాయం ఆసియాలోని మార్కెట్లతో పాటు భారత మార్కెట్లను సైతం ప్రభావితం చేస్తోంది. అలాగే అమెరికాలో ఫిబ్రవరిలో వ్యాపార కార్యకలాపాలు 8 నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. దీంతో ఫెడ్ తన వడ్డీ రేట్ల పెంపును దీర్ఘకాలం పాటు కొనసాగించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సెంటిమెంట్ మార్కెట్లపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. దీర్ఘకాలికంగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చే నెల సమావేశంలో వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

టాప్ గెయినర్స్..
NSE సూచీలో బజాజ్ ఆటో, సన్ ఫార్మా, దివీస్ ల్యాబ్స్, టాటా కన్జూమర్, డాక్టర్ రెడ్డీస్, మారుతీ, బ్రిటానియా, కోల్ ఇండియా కంపెనీల షేర్లు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి.

టాప్ లూజర్స్..
సూచీలోని అదానీ ఎంటర్ ప్రైజెస్, అదనీ పోర్ట్స్, బీపీసీఎల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, గ్రాసిమ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, రిలయన్స్, ఐషర్ మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, కోటక్ బ్యాంక్ కంపెనీల షేర్లు మాత్రం నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..



Click it and Unblock the Notifications