Opening Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్న నష్టాలతో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే నేడు బుల్స్ తిరిగి జోరులోకి రావటంతో ఉదయం ప్రారంభం నుంచి మార్కెట్లు ఎగిసిపడుతున్నాయి.
ఉదయం 9.22 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 473 పాయింట్ల లాభంలో ఉండగా మరో కీలక సూచీ నిఫ్టీ 145 పాయింట్ల మేర లాభంతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 291 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 440 పాయింట్ల మేర లాభపడింది. ఈ క్రమంలో జీ ఎంటర్టైన్మెంట్ కంపెనీ షేర్లు ఏకంగా 9 శాతం నష్టపోగా.. షేర్ల బైబ్యాక్ ప్రకటించిన బజాజ్ ఆటో స్టాక్ లాభాల్లో ముందుకు సాగుతున్నాయి.

ఎన్ఎస్ఈలో విప్రో, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, ఎల్‌టిఐఎమ్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, ఎల్‌టి, టీసీఎస్, టాటా కన్జూమర్, అపోలో హాస్పిటల్స్, కోల్ ఇండియా, ఎస్బీఐ, టాటా మోటార్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హెట్సీఎల్ టెక్నాలజీస్, గ్రాసిమ్, టాటా స్టీల్, యూపీఎల్, హీరో మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ఇదే క్రమంలో పవర్ గ్రిడ్, బ్రిటానియా కంపెనీల షేర్లు మాత్రమే నష్టాల్లో టాప్ లూజర్లుగా ఉన్నాయి.
వాస్తవానికి సోమవారం అమెరికా మార్కెట్లు మంచి లాభాలను నమోదు చేయటం ప్రపంచ మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపాయి. 2024లో తొలిసారిగా నాశ్‌డాక్ సూచీ తొలిసారిగా 1 శాతం మేర లాభపడటంతో పాటు యూఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ తగ్గటం మార్కెట్లలో కంపెనీల మార్కెట్ క్యాప్ పెరిగేందుకు దోహదపడింది. దీని ప్రభావంతో గిఫ్ట్ నిఫ్టీ సైతం ఉదయం బలమైన ప్రారంభాన్ని సూచించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications