Stock Market: నష్టాల్లో కొనసాగుతున్న మార్కెట్లు.. తేరుకోని స్మాల్-మిడ్ క్యాప్స్..
Market Correction: దేశీయ స్టాక్ మార్కెట్లలో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. అయితే ఈ కరెక్షన్ మంచిదేనని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ పేర్కొంది. దీనిని పెద్ద పతనంగా పరిగణించకూడదని పేర్కొంది.
ఉదయం 9.34 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 59 పాయింట్ల నష్టంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 8 పాయింట్ల మేర లాభంతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 245 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 368 పాయింట్ల లాభంలో ముందుకు సాగుతోంది. మార్కెట్లలో కొనసాగుతున్న ఊగిసలాటతో అనేక మంది పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్లు స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ గురించి ఎక్కువగా భయపడుతున్నారు.

ఎన్ఎస్ఈలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, హీరో మోటార్స్, హిందాల్కొ, బీపీసీఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, గ్రాసిమ్, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, టాటా కన్జూమర్, ఎల్ టి, బ్రిటానియా, నెస్లే, యూపీఎల్, ఎయిర్ టెల్, హిందుస్థాన్ యూనీలివర్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, రిలయన్స్, సిప్లా కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టీసీఎల్, టైటాన్, ఎల్ టిఐఎమ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications