Stock Market: ఒడిదొడుకుల్లో సెన్సెక్స్-నిఫ్టీ.. ముంచిన స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్..
Opening Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త వారాన్ని ఒడిదొడుకుల్లో ప్రారంభించాయి. ఈ క్రమంలో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు సైతం తమ పతనాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే కొద్దిసేపటికే మార్కెట్లు తిరిగి తేరుకుంటున్నాయి.
ఉదయం 9.48 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 54 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతుండగా, మరో కీలక సూచీ నిఫ్టీ 14 పాయింట్ల మేర పెరుగుదలను చూసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 101 పాయింట్ల పెరిగింది. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 158 పాయింట్ల పతనాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, హిందాల్కొ కంపెనీల షేర్లు భారీగా పతనాన్ని నమోదు చేశాయి.

ఎన్ఎస్ఈలో ఎస్బీఐ లైఫ్, టాటా కన్జూమర్, బ్రిటానియా, శ్రీరామ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనీలివర్, సిప్లా, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్, దివీస్ ల్యాబ్, బజాజ్ ఫిన్ సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, కోటక్ బ్యాంక్, ఎల్ టి కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, హిందాల్కొ, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎస్బీఐ, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్స్, హీరో మోటార్స్, కోల్ ఇండియా, టెక్ మహీంద్రా, నెస్లే, యాక్సిస్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, మారుతీ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications