Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సూచీలు ఓలటాలిటీ మధ్య కొనసాగటం చూస్తే ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

మార్కెట్ సూచీలు..
ఉదంయ 10.03 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 225 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 68 పాయింట్ల మేర నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇదే సమయంలో నిప్టీ బ్యాంక్ సూచీ 120 పాయింట్లు నష్టాల్లో ఉండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం స్వల్పంగా 42 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి.

బల్క్ డీల్..
గోకల్‌దాస్ ఎక్స్‌పోర్ట్స్ దేశంలోని దుస్తులు తయారీ ఎగుమతి వ్యాపారంలో ఉంది. ప్రస్తుతం కంపెనీ దాదాపు ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాలకు తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. అయితే తాజాగా ఈ కంపెనీకి చెందిన 62.8 లక్షల షేర్లను బ్లాక్ డీల్ విండో ద్వారా చేతులు మారుతున్నాయి. డిసెంబర్ త్రైమాసికం ముగింపులో క్లియర్ వెల్త్ కన్సల్టెన్సీ సర్వీసెస్ LLP గోకల్‌దాస్ ఎక్స్‌పోర్ట్స్‌లో 20.56% వాటాను కలిగి ఉంది. ఈ డీల్ వివరాలు బయటకు రావటంతో స్టాక్ మార్కెట్లో నేడు నష్టాల్లో ట్రేడవుతోంది. ఉదయం 10.15 గంటల సమయంలో స్టాక్ ధర రూ.395.85 వద్ద ఉంది.
టాప్ గెయినర్స్..
NSE సూచీలోని టాటా స్టీల్, అపోలో హాస్పిటల్స్, హిందాల్కొ, జేఎస్డబ్ల్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, సిప్లా, భారతీ ఎయిర్ టెల్, ఎల్ అండ్ టి, అల్ట్రాటెక్ సిమెంట్స్, బజాజ్ ఆటో, దివీస్ ల్యాబ్ స్టాక్స్ మాత్రం లాభాల్లో ట్రేడవుతూ టాప్ గెయినర్స్ గా కొనసాగుతున్నాయి.

టాప్ లూజర్స్..
అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ లైఫ్, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐషర్ మోటార్స్, హీరో మోటార్స్, ఐటీసీ, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, టాటా కన్జూమర్, బీపీసీఎల్, ఎస్బీఐ, ఓఎన్జీసీ, గ్రాసిమ్ కంపెనీల షేర్లు మాత్రం నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications