Stock Market: ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు.. ఊరటనిస్తున్న మిడ్ క్యాప్ స్టాక్స్..
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఊగిసలాటలో కొనసాగుతున్నాయి. ప్రధాన సూచీలు ఫ్లాట్‌గా ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడింగ్ కొనసాగించటం దీనికి కారణంగా తెలుస్తోంది.
ఉదయం 10 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 4 పాయింట్ల నష్టంతో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 10 పాయింట్లు కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 77 పాయింట్లను కోల్పోగా.. మిడ్ క్యాప్ సూచీ మాత్రం 42 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ కొనసాగిస్తోంది.

ఎన్ఎస్ఈలో ఐషర్ మోటార్స్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఆటో, హీరో మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, ఎల్ టి, ఎయిర్ టెల్, బీపీసీఎల్, టాటా మోటార్స్, కోల్ ఇండియా, హిందాల్కొ, యూపీఎల్, అదానీ పోర్ట్స్, టైటాన్, గ్రాసిమ్, రిలయన్స్, పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఏషియన్ పెయింట్స్, అపోలో హాస్పిటల్స్, టెక్ మహీంద్రా, టీసీఎస్, బజాజ్ ఫిన్ సర్వ్, కోటక్ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, దివీస్ ల్యాబ్, మారుతీ, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, బ్రిటానియా, ఎస్బీఐ లైఫ్, ఎస్బీఐ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications