Stock Market: ఒడిదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు.. నిండా మునుగుతున్న ఆ ఇన్వెస్టర్లు..
Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లలో చాలా రోజులుగా అస్థిరత కొనసాగుతూనే ఉంది. నిఫ్టీ సూచీ మాత్రం ర్యాలీని కొనసాగిస్తూనే ఉన్నప్పటికీ.. ఇన్వెస్టర్లలో మాత్రం ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఉదయం 9.59 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 18 పాయింట్ల లాభంలో ఉండగా.. నిఫ్టీ సూచీ 27 పాయింట్ల నష్టంలో కొనసాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 23 పాయింట్ల లాభంలో ఉండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 848 పాయింట్ల భారీ నష్టంలో కొనసాగుతోంది. ప్రస్తుతం మార్కెట్లలో అలుముకున్న అనిశ్చితుల కారణంగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు భారీగా క్రాష్ అయ్యాయి. వీటిలో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులు లక్షల కోట్లు కోల్పోతున్నారు.

ఎన్ఎస్ఈలో బ్రోకరేజీలు బులిష్ వ్యాల్యుయేషన్ వ్యూ కారణంగా ఐటీసీ కంపెనీ షేర్లు టాప్ గెయినర్ గా మెుదటి స్థానంలో కొనసాగుతోంది. దీని తర్వాత నెస్లే, బ్రిటానియా, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, ఎల్ టిఐఎమ్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, విప్రో, సిప్లా, హెచ్సీఎల్ టెక్నాలజీస్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, టాటా స్టీల్, టాటా మోటార్స్, బీపీసీఎల్, యూపీఎల్, హిందాల్కొ, టాటా కన్జూమర్, ఎయిర్ టెల్, మారుతీ, టైటాన్, హీరో మోటార్స్, హిందుస్థాన్ యూనీలివర్, జేఎస్డబ్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications