Stock Market: నిన్న భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు నేడు ఫ్లాట్ గా తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. అయితే ఆ స్వల్ప లాభాలు సైతం క్షణాల్లోనే ఆవిరయ్యాయి. ప్రధానంగా అమెరిగా బ్యాంకింగ్ వ్యవస్థ పతనమే దీనికి కారణంగా తెలుస్తోంది.

మార్కెట్ సూచీలు..
ఉదయం 09:27 గంటల సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ ఓలటాలిటీలో ట్రేడ్ అవుతున్నాయి. బెంచ్ మార్క్ సూచీలు అటు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ సూచీ 47 పాయింట్లు, నిఫ్టీ సూచీ 12 పాయింట్ల స్వల్ప లాభంలో ఉన్నాయి. ఇక నిఫ్టీ బ్యాంక్ సూచీ 65 పాయింట్ల నష్టంలో ఉండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 89 పాయింట్ల నష్టంలో కొనసాగుతోంది.

ఎందుకీ అనిశ్చితి..
అమెరికా బ్యాంకింగ్ రంగంలో ఏకకాలంలో రెండు సంస్థలు కుప్పకూలటం ఇదే తొలిసారి. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లతో పాటు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది ఒక సంస్థ నుంచి ఇంకొకదానికి పాకే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ఇండియాలో రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను ప్రభుత్వం వెలువరించింది. ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో స్వల్పంగా తగ్గినప్పటికీ అది ఇంకా ప్రమాదకర స్థాయిల్లోనే ఉందని తెలుస్తోంది. ఈ పరణామాల నేపథ్యంలో బంగారం ధరలు సైతం క్రమంగా పెరుగుతున్నాయి.

టాప్ గెయినర్స్..
NSE సూచీలో ఎల్ టి, టైటాన్, భారతీ ఎయిర్ టెల్, ఎస్బీఐ లైఫ్, సిప్లా, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా స్టీల్, హిందాల్కొ, రిలయన్స్, ఇన్ఫోసిస్, ఐటీసీ, బ్రిటానియా, నెస్లే ఇండియా, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్, బీపీసీఎల్, దివీస్ ల్యాబ్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హీరో మోటార్స్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.

టాప్ లూజర్స్..
ఇదే క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, గ్రాసిమ్, టాటా మోటార్స్, మారుతీ, హెచ్సీఎల్ టెక్, అపోలో హాస్పిటల్స్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, యూపీఎల్, ఐషర్ మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్ సర్వ్, కోల్ ఇండియా కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications