Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటి ఒడిదొడుకుల తర్వాత నేడు పుంజుకున్నాయి. ఉదయం ఆరంభంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 200 పాయింట్ల మేర లాభంతో తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. నిన్న అమిత్ షా మార్కెట్లపై చేసిన కామెంట్లతో కొంత లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది.
అయితే మార్కెట్లలో కొనసాగుతున్న భారీ ఓలటాలిటీతో కీలక బెంచ్ మార్క్ సూచీలు లాభాల నుంచి కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9.27 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 82 పాయింట్ల లాభంలో ఉండగా, మరో కీలక సూచీ నిఫ్టీ 31 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 14 పాయింట్ల స్వల్ప నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 15 పాయింట్ల లాభంతో ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఇంట్రాడేలో నేడు జొమాటో, శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు ఫోకస్ లో కొనసాగుతున్నాయి.

ఎన్ఎస్ఈలో శ్రీరామ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, హిందాల్కొ, జేఎస్డబ్ల్యూ స్టీల్, హీరో మోటార్స్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఓఎన్డీసీ, ఎస్బీఐ, అదానీ ఎంటర్ ప్రైజెస్, రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎల్ టిఐఎమ్, ఎల్ టి, టైటాన్ కంపెనీల షేర్ల లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని నేడు కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో సిప్లా, దివీస్ ల్యాబ్, ఏషియన్ పెయింట్స్, టాటా కన్జూమర్, నెస్లే, బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్స్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంక్, బ్రిటానియా, సన్ ఫార్మా, టీసీఎస్, గ్రాసిమ్, కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టెక్ మహీంద్రా కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications