Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. ప్రపంచ మార్కెట్ల అస్థిరతల్లో..
Stock Market: కొత్త వారం దేశీయ స్టాక్ మార్కెట్లు అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో స్వల్ప లాభాల్లో తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. అయితే మార్కెట్లు క్రమంగా పుంజుకుంటున్నాయి.
ఉదయం 9.35 గంటల సమయంలో స్టాక్ మార్కెట్ సూచీ సెన్సెక్స్ 177 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ 56 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 108 పాయింట్ల లాభంలో ఉండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం స్వల్పంగా నష్టాల్లో ట్రేడ్ అవుతోంది.

నేడు మార్కెట్లలో ప్రధానంగా ఫార్మా, మెటల్, పవర్ స్టాక్స్ సూచీలకు అండగా నిలుస్తున్నాయి. అమెరికా మార్కెట్లలో నిండిన బ్యాంకింగ్ భయాలను తొలగించేందుకు ఫెడ్ అధికారులు చేపట్టిన చర్యల నేపథ్యంలో గతవారం అక్కడి మార్కెట్లు ఓలటాలిటీ ఉన్నప్పటికీ లాభాల్లో ముగిశాయి. అయితే సెంట్రల్ బ్యాంకులు దూకుడు తగ్గించినప్పటికీ ఇంకా రేట్ల పెంపు కొనసాగుతున్నందున మార్కెట్లలో అలజడి కొనసాగుతూనే ఉంది.
NSE సూచీలోని అపోలో హాస్పిటల్స్, హిందాల్కొ, పవర్ గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, ఓఎన్జీసీ, గ్రాసిమ్, టాటా స్టీల్, ఎల్ టి, జేఎస్డబ్ల్యూ స్టీల్, దివీస్ ల్యాబ్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యూపీఎల్, భారతీ ఎయిర్ టెల్, టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.
ఇదే సమయంలో సూచీలోని అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ లైఫ్, హిందుస్థాన్ యూనీలివర్, టాటా కన్జూమర్, అదానీ పోర్ట్స్, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, బీపీసీఎల్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.


Click it and Unblock the Notifications