Stock Market: వారాంతంలో హుషారు.. లాభాల్లో మార్కెట్ సూచీలు.. ఈ రంగాల షేర్లకే డిమాండ్..
Stock Market Opening Bell: వారాంతంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లకు కాసుల పంట కురిపిస్తున్నాయి. గురువారం డెరివేటివ్స్ ఎక్స్పైరీ రోజు అయినప్పటికీ మార్కెట్లు బుల్ జోరును కొనసాగించాయి. ఆ జోరు ఈ రోజు కూడా కొనసాగనున్నట్లు ఎస్జీఎక్స్ నిఫ్టీ సూచించింది. దానికి అనుగుణంగా మార్కెట్లు ఆరంభంలో గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యాయి.

సూచీల శుభశూచికం..
ఉదయం 9.20 గంటల సమయంలో మార్కెట్ల ప్రారంభం తర్వాత ప్రధాన బెంచ్ మార్క్ సూచీలను పరిశీలిస్తే.. సెన్సెక్స్ 332 పాయింట్ల లాభంలో ఉంది. అదే సమయంలో మరో సూచీ నిఫ్టీ 102 పాయింట్లకు పైగా లాభంలో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ సూచీ 332 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 192 పాయింట్ల లాభంలో ఆశాజనకంగా ఉన్నాయి.

కొనుగులోకు సరైన సమయమేనా..?
ఈ రోజు మార్కెట్లో ప్రధానంగా ఫైనాన్స్, మెటల్ రంగాలకు చెందిన స్టాక్స్ పాజిటివ్ గా ఉన్నాయి. ఇదే క్రమంలో రియల్టీ రంగానికి చెందిన స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలోని కంపెనీల షేర్లను కొనేందుకు మదుపరులు ఎక్కువగా మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ తో రూపాయి మారకపు విలువ 79.64గా ఉంది. కంపెనీల వ్యాల్యూయేషన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను కొనసాగించవచ్చని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

గెయినర్స్..
మార్కెట్స్ ఆరంభసమయంలో నిఫ్టీ సూచీలోని శ్రీ సిమెంట్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హిందాల్కొ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ యూనిలివర్, టాటా స్టీల్, జేఎస్దబ్యూ స్టీల్, గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.

లూజర్స్..
మార్కెట్ ఆరంభంలో నిఫ్టీ సూచీలోని కోల్ ఇండియా, బీపీసీఎల్, ఎయిర్ టెల్, పవర్ గ్రిడ్, సిప్లా వంటి స్టాక్స్ నష్టపోయి టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications