Modi Winning: మోదీకి దేశ ప్రజలు ఊహించని షాక్ ఈ ఎన్నికల్లో అందించారు. ప్రధాని మోదీ చరిష్మా మసకబారటం స్పష్టంగా కాంగ్రెస్ గెలుపుతో వ్యక్తమైంది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో నిన్న వచ్చిన పెద్ద సునామీ లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపదను మింగేసింది.
వాస్తవానికి మోదీ కూటమి ఎన్డీయే గెలిచినప్పటికీ మార్కెట్లను మెప్పించటంలో ఓడిపోయారని నిపుణులు చెబుతున్న మాట. నేడు సైతం మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత మార్కెట్లు తిరిగి గాడిన పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తోందని వారు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో సెన్సెక్స్ సూచీ 500 పాయింట్లు లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 150 పాయింట్లు పెరిగింది. అలాగే నిఫ్టీ బ్యాంక్ సూచీ 8 పాయింట్ల లాభంలో ఉండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ 90 పాయింట్ల లాభంలో 10.13 గంటలకు కొనసాగుతున్నాయి.

ఎన్ఎస్ఈలో హిందుస్థాన్ యూనీలివర్, బ్రిటానియా, హీరో మోటార్స్, టాటా కన్జూమర్, నెస్లే, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, కోటక్ బ్యాంక్, బజాజ్ ఆటో, దివీస్ ల్యాబ్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, సన్ ఫార్మా, సిప్లా, ఎస్బీఐ లైఫ్, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు లాభాలతో ఇంట్రాడేలో టాప్ గెయినర్లుగా ముందుకు కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో బీపీసీఎల్, ఎల్‌టి, పవర్ గ్రిడ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, గ్రాసిమ్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, కోల్ ఇండియా, హిందాల్కొ, ఓఎన్జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీ షేర్లు నష్టాలతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications