Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల నుంచి రికవర్ అవుతున్నాయి. నిన్న లాభాలతో ముగిసిన మార్కెట్లు నేడు అదే ధోరణిని కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా వాల్ స్ట్రీల్ 1 శాతం మేర లాభపడటం బలాన్ని అందిస్తోంది.
ఉదయం 9.18 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 178 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 48 పాయింట్ల మేర లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 146 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 243 పాయింట్ల మేర లాభాలతో ఇంట్రాడేలో ముందుకు సాగుతున్నాయి. ప్రీ ఓపెనింగ్ సెషన్లోనూ నేడు మార్కెట్లు మంచి లాభాలను నమోదు చేశాయి. మెుత్తానికి నెలాఖరులో మార్కట్లు కొంత సానుకూలంగా ఉన్నాయి.

ఎన్ఎస్ఈలో హిందాల్కొ, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఆటో, బీపీసీఎల్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా స్టీల్, హీరో మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, సిప్లా, ఎస్బీఐ లైఫ్, టాటా కన్జూమర్, ఐటీసీ, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, నెస్లే, గ్రాసిమ్, టెక్ మహీంద్రా, అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, విప్రో, కోల్ ఇండియా, రిలయన్స్, ఎల్ టి, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్ యుఎల్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో ఎయిర్ టెల్, బ్రిటానియా, యూపీఎల్, ఎల్ టిఐఎమ్, ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, టెక్ మహీంద్రా, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, టీసీఎస్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications