Stock Market: లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇరగదీస్తున్న జియో ఫైనాన్షియల్స్..
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. మార్కెట్లో ఓలటాలిటీ కొనసాగుతున్నప్పటికీ నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు లాభాలను కొనసాగిస్తున్నాయి.
ఉదయం 10.02 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 115 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 53 పాయింట్ల లాభాల్లో ఉంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 83 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 291 పాయింట్ల లాభంతో దూసుకుపోతున్నాయి. భారీ ఒడిదొడుకుల వల్ల స్వల్ప లాభాల్లోనే మార్కెట్ల ప్రయాణం కొనసాగుతోంది. మార్కెట్లో ఐఆర్ఎఫ్సీ, జియో ఫైనాన్షియల్స్ కంపెనీల షేర్లు ప్రధానంగా ఫోకస్ లో కొనసాగుతున్నాయి.

ఎన్ఎస్ఈలో కోల్ ఇండియా, జియో ఫైనాన్షియల్స్, టాటా స్టీల్, హిందాల్కొ, అల్ట్రాటెక్ సిమెంట్స్, గ్రాసిమ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐషర్ మోటార్స్, ఎన్టీపీసీ, ఎల్ టి, బీపీసీఎల్, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, డాక్టర్ రెడ్డీస్, హీరో మోటార్స్, మారుతీ, దివీస్ ల్యాబ్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, నెస్లే, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్జూమర్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనీలివర్, సిప్లా, యూపీఎల్, కోటక్ బ్యాంక్, ఐటీసీ, ఎల్ టిఐఎమ్, టీసీఎస్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications