Stock Market: ఎన్నికల ముందు మార్కెట్లలో అలజడి.. కుప్పకూలిన సెన్సెక్స్-నిఫ్టీ..

Market Opening: దేశంలో సార్వత్రిక ఎన్నికలకు నగరా మోగిన వేళ స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతోంది. భారీగా పెరిగిన ఓలటాలిటీతో కీలక సూచీలు నేడు ఆరంభంలోనే కుప్పకూలాయి. ప్రధానంగా టీసీఎస్ షేర్ల పతనం దీనిని మరింత తీవ్రతరం చేస్తోంది.

ఉదయం 9.24 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 406 పాయింట్ల నష్టంలో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 124 పాయింట్ల మేర నష్టపోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 106 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 156 పాయింట్లు కోల్పోయాయి. దీనికి తోడు దేశీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు, డొమెస్టిక్ పెట్టుబడిదారులు ఫెడ్ వడ్డీ రేట్ల ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Indian stock markets trading in big loses amid loksabha elections and volatality

ఎన్ఎస్ఈలో టాటా స్టీల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హిందాల్కొ, యూపీఎల్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, ఎయిర్ టెల్, ఎస్బీఐ, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.

ఇదే క్రమంలో టీసీఎల్, బీపీసీఎల్, నెస్లే, అపోలో హాస్పిటల్స్, విప్రో, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టాటా కన్జూమర్, సిప్లా, ఎస్బీఐ లైఫ్, బ్రిటానియా, రిలయన్స్, మారుతీ, ఎల్ టి, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, ఎల్ టిఐఎమ్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+