Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం తమ ప్రయాణాన్ని నష్టాల్లో ప్రారంభించింది. ఉదయం గిఫ్ట్ నిఫ్టీ సూచీ నష్టాలను సూచించింది. నేడు ఇండియా విక్స్ సూచీ ఎన్నికల వేడితో 11 శాతం పెరిగింది. దీంతో ఓలటాలిటీ అధికంగా మార్కెట్లలో కొనసాగుతోంది.
ఉదయం 9.47 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ సూచీ 600 పాయింట్ల మేర నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 166 పాయింట్ల నష్టంతో ఇంట్రాడేలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ 304 పాయింట్లు నష్టంతో ముందుకు సాగుతుండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 668 పాయింట్ల నష్టంతో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. వాస్తవానికి నేడు ఆటో రంగంలోని షేర్ల పతనం కీలక బెంచ్ మార్క్ సూచీలను నష్టాల్లోకి నెట్టింది. అలాగే హెల్త్ కేర్ రంగంలోని కంపెనీల షేర్లు పుంజుకున్నాయి.

ఎన్ఎస్ఈలో సిప్లా, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐషర్ మోటార్స్, ఏషియన్ పెయింట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, సన్ ఫార్మా, బ్రిటానియా, అదానీ పోర్ట్స్, కోటక్ బ్యాంక్, ఐటీసీ, ఎస్బీఐ లైఫ్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో టాటా మోటార్స్, బీపీసీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, ఎన్టీపీసీ, శ్రీరామ్ ఫైనాన్స్, హీరో మోటార్స్, హిందాల్కొ, విప్రో, రిలయన్స్, పవర్ గ్రిడ్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ, టాటా కన్జూమర్, టెక్ మహీంద్రా కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications