Stock Market: లాభాల్లో కొత్త వారం ప్రారంభించిన మార్కెట్లు.. ఫోకస్ స్టాక్స్ ఇవే..
Opening Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు మంచి లాభాలతో తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. భారత్ విజయవంతంగా జీ20 సదస్సు పూర్తి చేసిన మరుసటిరోజే మార్కెట్లలో ఇన్వెస్టర్ల కోలాహలం కొనసాగుతోంది.
ఉదయం 9.19 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 222 పాయింట్ల మేర లాభాలతో కొనసాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ 79 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతుండగా.. నిఫ్టీ బ్యాంక్ సూచీ 163 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 316 పాయింట్ల భారీ లాభాలతో ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి. ప్రధానంగా మార్కెట్లలో నేడు ఐఆర్బీ ఇన్‌ఫ్రా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఎస్జేవీఎన్ కంపెనీల షేర్లు ఫోకస్‌లో కొనసాగుతున్నాయి.

ఎన్ఎస్ఈలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్స్, దివీస్ ల్యాబ్, ఎన్టీపీసీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, పవర్ గ్రిడ్, హిందాల్కొ, సన్ ఫార్మా, విప్రో, ఏషియన్ పెయింట్స్, టాటా కన్జూమర్, హీరో మోటార్స్, ఎల్ టి, యూపీఎల్, రిలయన్స్, బజాజ్ ఆటో కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్, ఐషర్ మోటార్స్, భారతీ ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్లుగా ఇంట్రాడేలో నిలిచాయి.


Click it and Unblock the Notifications