Stock Market: పేలుడు లాభాలతో మెుదలైన సెన్సెక్స్-నిఫ్టీ..!
Market Opening: నిన్న ఒడిదొడుకుల నుంచి తేరుకుని స్వల్ప నష్టాల్లో ట్రేడింగ్ క్లోజ్ చేసిన కీలక సూచీలు నేడు తిరిగి పుంజుకున్నాయి. ఉదయం ఆరంభంలోనే భారీ లాభాలతో బౌన్స్ బ్యాంక్ అయ్యాయి.
ఉదయం 9.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 501 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 146 పాయింట్ల మేర లాభపడింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 428 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 298 పాయింట్ల మేర భారీ లాభంతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో నేడు ఇంట్రాడేలో డీమార్ట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఏంజల్ వన్ కంపెనీల షేర్లు ఫోకస్ లో కొనసాగుతున్నాయి.

NSEలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ, హిందాల్కొ, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా, దివీస్ ల్యాబ్, టాటా కన్జూమర్, బీపీసీఎల్, ఐషర్ మోటార్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, టైటాన్, హీరో మోటార్స్, టాటా మోటార్స్, టీసీఎస్, కోటక్ బ్యాంక్, ఓఎన్జీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నేడు కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, సన్ ఫార్మా కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా ఇంట్రాడేలో ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు సరికొత్త రికార్డు గరిష్ఠాలకు చేరుకుని సామాన్యులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.


Click it and Unblock the Notifications