Stock Market: భారీ లాభాలతో మెుదలైన Sensex, Nifty.. జీడీపీ డేటా జోరు..
Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు డిసెంబర్ నెల మెుదటి రోజును లాభాలతో శుభదాయకంగా మెుదలుపెట్టాయి. ప్రధానంగా నవంబర్ చివరి రోజు ఎన్నికలు, ఎక్స్ పైరీ వంటి కారణాల రీత్యా కొంత ఒడిదొడుకుల్లో సూచీలు ట్రేడింగ్ కొనసాగించాయి. క్యూ2 జీడీపీ అంచనాలను మించటం ఆశాజనకంగా మారింది.
ఉదయం 9.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 223 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 75 పాయింట్ల మేర లాభాలతో తన ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 78 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 300 పాయింట్ల మేర లాభాలను నమోదు చేశాయి. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ తన కొత్త జీవితకాల గరిష్ఠాన్ని నేడు ప్రారంభ ట్రేడింగ్ సమయంలో అందుకుంది. ఇదే క్రమంలో బల్క్ డీల్ కారణంగా ఎయిర్ టెల్ షేర్లు ఫోకస్‌లో కొనసాగుతున్నాయి.

ఎన్ఎస్ఈలో ఎన్టీపీసీ, అపోలో హాస్పిటల్స్, ఎల్ టి, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎల్ టిఐఎమ్, పవర్ గ్రిడ్, గ్రాసిమ్, బజాజ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్, హిందాల్కొ, దివీస్ ల్యాబ్, బ్రిటానియా, బజాజ్ ఫిన్ సర్వ్, బీపీసీఎల్, టాటా కన్జూమర్, సన్ ఫార్మా, ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్, యూపీఎల్, టీసీఎస్, టాటా స్టీల్, ఎయిర్ టెల్, రిలయన్స్ సహా మరిన్ని కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగించాయి.
ఇదే క్రమంలో బజాజ్ ఆటో, హీరో మోటార్స్, విప్రో, టైటాన్, టాటా మోటార్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, ఎస్బీఐ లైఫ్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications