Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో అనూహ్యమైన మలుపు వచ్చింది. వరుసగా 3 రోజుల పాటు మార్కెట్లు తీవ్రంగా నష్టాలకు గురైన తర్వాత నేడు రివ్వున దూసుకుపోతున్నాయి. ఈ ఏడాదిలో ఇన్వెస్టర్లకు ఇదొక శుభ సోమవారంగా చెప్పుకోవచ్చు. బేర్ల ఆధిపత్యానికి కళ్లెం వేసి బుల్స్ తమ జోరును కొనసాగిస్తున్నారు.

మార్కెట్లను నడిపిస్తోంది..
అమెరికా ఆర్థిక వ్యవస్థలో ప్రతికూల పరిస్థితులు నెమ్మదిగా దారికి రావటం మెుదలైంది. అమెరికా డిసెంబర్ జాబ్ డేటా రావటంతో ఆందోళనలు తగ్గాయి. డిసెంబరులో వేతన వృద్ధి మందగించిందని, ద్రవ్యోల్బణం తగ్గుతోందని ఫెడరల్ రిజర్వ్ పేర్కొంది. కొందరు భయపడినంత దూకుడుగా పరిస్థితులు లేకపోవటం ఇన్వెస్టర్లలో జోష్ నింపింది. ఈ ప్రకటన తర్వాత ఆసియా మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

మార్కెట్ సూచీలు..
మధ్యాహ్నం 12.21 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 920 పాయింట్లు, నిఫ్టీ 260 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 470 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 254 పాయింట్ల మేర లాభాలతో కొనసాగుతున్నాయి. దాదాపుగా అన్ని రంగాలకు చెందిన సూచీలు సైతం మంచి లాభాల్లో కొనసాగుతున్నాయి. దీనికి తోడు ఈ వారం ఐటీ రంగంలోని కంపెనీలు తమ క్యూ3 ఫలితాలను విడుదల చేయనున్న తరుణంలో ఇన్వెస్టర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు.

టాప్ గెయినర్స్..
ఈ సమయంలో ఎన్ఎస్ఈ సూచీలో మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్ టెల్, విప్రో, టాటా మోటార్స్, రిలయన్స్, ఎస్బీఐ లైఫ్, హిందాల్కొ, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, యూపీఎల్, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, సిప్లా కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.

టాప్ లూజర్స్..
ఇక సూచీలో నష్టాల్లో కొనసాగుతున్న షేర్ల విషయాన్ని గమనిస్తే.. టైటాన్ కంపెనీ ముందు వరుసలో నిలిచింది. టైటాన్ విడుదల చేసిన ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోకపోవటంతో ఇన్వెస్టర్లు నిరాశకు గురయ్యారు. దీని తర్వాత హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఆటో, బ్రిటానియా, గ్రాసిమ్, బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీల షేర్లు మాత్రం నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications