Market Opening: నష్టాల నుంచి తేరుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. గ్లోబల్ మార్కెట్లు గ్రీన్..
Opening Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నమోదైన భారీ అమ్మకాల నష్టాల నుంచి తిరిగి తేరుకున్నాయి. ఈ క్రమంలో జొమాటో, మ్యాక్స్ ఫైనాన్షియల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీల షేర్లు యాక్టివ్‌గా కొనసాగుతున్నాయి.
ఉదయం 9.40 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 41 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో మరో కీలక సూచీ 15 పాయింట్ల మేర లాభపడి ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 63 పాయింట్ల లాభంతో కొనసాగుతుండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 263 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతున్నాయి. ప్రధానంగా గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల ధోరణి, మెున్న అమెరికా మార్కెట్లలో పతనం నుంచి కోలుకోవటంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు తిరిగి పుంజుకుంటున్నాయి.

ఎన్ఎస్ఈలో అల్ట్రాటెక్ సిమెంట్స్, టైటాన్, శ్రీరామ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, టాటా స్టీల్, అపోలో హాస్పిటల్స్, గ్రాసిమ్, దివీస్ ల్యాబ్, విప్రో, హిందుస్థాన్ యూనీలివర్, డాక్టర్ రెడ్డీస్, ఎల్ టిఐఎమ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్, హిందాల్కొ, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో కంపెనీల షేర్లు లాభాలతో ముందుకు సాగుతున్నాయి.
ఇదే క్రమంలో హెచ్డీఎఫ్సీ లైఫ్, నెస్లే, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎయిర్ టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, బ్రిటానియా, ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, కోల్ ఇండియా, ఎల్ టి, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్, హీరో మోటార్స్, సన్ ఫార్మా, టీసీఎస్, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు నష్టాలతో ముందుకు సాగుతున్నాయి.


Click it and Unblock the Notifications