Stock Market: భారీ లాభాల్లో మెుదలైన స్టాక్ మార్కెట్లు.. సానుకూలంగా సెంటిమెంట్లు..
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త వారాన్ని మంచి లాభాలతో మెుదలుపెట్టాయి. ఈ క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండిగో కంపెనీల షేర్లు ఫోకస్‌లో కొనసాగుతున్నాయి.
ఉదయం 9.20 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 341 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 107 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 191 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 219 పాయింట్ల మేర లాభాలతో ఇంట్రాడేలో ముందుకు సాగుతున్నాయి. ఊహించిన దానికంటే ముందరే వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందనే అంచనాల మధ్య ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

బాండ్ దిగుబడి తగ్గడం, ముడి చమురు ధరల నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అమెరికన్, యూరోపియన్ ఈక్విటీలు వరుసగా 5%, 3% లాభాలతో వారం ముగిశాయి. ఇదే సమయంలో భారతీయ ఈక్విటీలు కేవలం 1% మాత్రమే పెరిగాయి. ఇది ర్యాలీకి అధిక సామర్థ్యాన్ని చూపుతుంది. GIFT నిఫ్టీ నుంచి బలమైన ప్రారంభాన్ని సూచించిన తరుణంలో నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి పనితీరును కనబరుస్తున్నాయి.
NSEలో కోల్ ఇండియా, ఐషర్ మోటార్స్, హీరో మోటార్స్, గ్రాసిమ్, యాక్సిస్ బ్యాంక్, హిందాల్కొ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎల్ టి, అపోలో హాస్పిటల్స్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే, దివీస్ ల్యాబ్, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, సిప్లా, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, ఎల్ టిఐఎమ్, మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, ఎస్బీఐ లైఫ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, కోటక్ బ్యాంక్, బ్రిటానియా, రిలయన్స్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు లాభాలతో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో కేవలం టైటాన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంపెనీల షేర్లు మాత్రమే నష్టాల్లో కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications