Stock Market: లాభాల్లో సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లలో కొనుగోళ్ల కోలాహలం..
Market Opening: నిన్న భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు తిరిగి లాభాల బాట పట్టాయి. నేడు మార్కెట్లలో ఆటో, మెటల్ రంగాల్లో కనిపించిన కొనుగోళ్ల కోలాహలం దీనికి కారణంగా నిపుణులు చెబుతున్నారు. అయితే ఇన్వెస్టర్లు ఫెడ్ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భారతీయ మార్కెట్లు ఆసియా మార్కెట్ల జోష్ కొనసాగిస్తున్నాయి. ఉదయం 9.47 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 179 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 42 పాయింట్ల మేర లాభంతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 81 పాయింట్ల మేర లాభపడగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం స్వల్పంగా 125 పాయింట్ల నష్టంతో ముందుకు సాగుతోంది. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఇంకా కొనసాగుతున్నాయి.

ఎన్ఎస్ఈలో ఐషర్ మోటార్స్, మారుతీ, బీపీసీఎల్, నెస్లే, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్స్, అపోలో హాస్పిటల్స్, రిలయన్స్, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఎల్ టి, ఐటీసీ, ఎయిర్ టెల్, ఎల్ టిఐఎమ్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ఇంట్రాడేలో కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో హిందాల్కొ, యూపీఎల్, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, టాటా మోటార్స్, దివీస్ ల్యాబ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా కన్జూమర్, గ్రాసిమ్, సిప్లా, హెచ్డీఎఫ్సీ లైఫ్, హిందుస్థాన్ యూనీలివర్, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఓఎన్జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, హీరో మోటార్స్, టైటాన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్ ఫార్మా కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications