Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీలు తమ ప్రయాణాన్ని సానుకూలంగా మెుదలుపెట్టాయి.
ఉదయం 9.20 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 103 పాయింట్ల లాభంతో కొనసాగుతుండగా, మరో కీలక సూచీ నిఫ్టీ 35 పాయింట్ల మేర లాభపడి ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 95 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 292 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్ల ప్రకటన సానుకూలంగా ఉంటుందనే ఊహాగానాల మధ్య ప్రపంచ మార్కెట్లు తమ సానుకూల ప్రయాణాన్ని నేడు కొనసాగిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఎన్ఎస్ఈలో హిందాల్కొ, టాటా స్టీల్, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, గ్రాసిమ్, ఐషర్ మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, టాటా మోటార్స్, కోల్ ఇండియా, రిలయన్స్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా, శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్ టి, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో హిందుస్థాన్ యూనీలివర్, బ్రిటానియా, హీరో మోటార్స్, నెస్లే, బజాజ్ ఆటో, దివీస్, ఎస్బీఐ లైఫ్, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా కన్జూమర్, ఎల్ టిఐఎమ్, సిప్లా, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ లైఫ్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications