Nifty Record: రికార్డుల మోత ఆపని నిఫ్టీ సూచీ.. లాభాల్లో ఆ మూడు రంగాల స్టాక్స్..
Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నిన్నటి లాభాల పరంపరను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ నేడు ఇంట్రాడేలో సరికొత్త రికార్డు గరిష్ఠాలను తాకింది.
ఉదయం 9.43 గంటల సమంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 130 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 75 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 172 పాయింట్ల లాభంతో తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా నేడు ఆటో, ఎఫ్ఎంసీజీ, రియల్టీ రంగాలకు చెందిన కంపెనీల షేర్లు మార్కెట్ల ర్యాలీకి ఊతం ఇస్తున్నాయి. నేడు నిఫ్టీ సూచీ ఇంట్రాడేలో 24,650.05 పాయింట్లను చేరుకుని తన సరికొత్త జీవితకాల గరిష్ఠాలను అందుకుంది.

ఎన్ఎస్ఈలో ఎయిర్ టెల్, బీపీసీఎల్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, గ్రాసిమ్, హిందుస్థాన్ యూనీలివర్, ఐషర్ మోటార్స్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫిన్ సర్వ్, మారుతీ, బజాజ్ ఆటో, సిప్లా కంపెనీల షేర్లు ఇంట్రాడేలో లాభాలతో టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో కోటక్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్ టి, హీరో మోటార్స్, హిందాల్కొ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, విప్రో, రిలయన్స్, ఎల్ టిఐఎమ్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, ఎస్బీఐ, బ్రిటానియా కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications