Stock Market: లాభాలతో స్టాక్ మార్కెట్లు కళకళ.. అవి తగ్గటంతో బుల్స్ జోరు..
Stock Market: ఈవారం ప్రారంభం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు కొంత ఒడిదొడుకులతో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేడు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ముందుకు సాగుతున్నాయి.
ఉదయం 9.21 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 147 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 42 పాయింట్ల మేర లాభపడింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 80 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 146 పాయింట్ల లాభంతో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. వాస్తవానికి యూఎస్ బాండ్స్ ఈల్డ్స్ తగ్గటంతో అంతర్జాతీయ మార్కెట్లలో జోష్ నిండింది. నిన్న అమెరికా మార్కెట్లు సైతం ఇదే పాజిటివ్ ధోరణిని కనబరిచాయి.

ఎన్ఎస్ఈలో బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఏషియన్ పెయింట్స్, విప్రో, అదానీ పోర్ట్స్, టాటా కన్జూమర్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ టిఐఎమ్, బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హీరో మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, నెస్లే, బీపీసీఎల్, పవర్ గ్రిడ్, యూపీఎల్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, అపోలో హాస్పిటల్స్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, గ్రాసిమ్, బ్రిటానియా, ఇన్ఫోసిస్, గ్రాసిమ్, మారుతీ, రిలయన్స్, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, ఎయిర్ టెల్, అపోలో హాస్పిటల్స్, కోటక్ బ్యాంక్, టాటా స్టీల్ సహా మరిన్ని కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో సిప్లా, డాక్టర్ రెడ్డీస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హిందాల్కొ, ఓఎన్జీసీ, హిందుస్థాన్ యూనీలివర్, సన్ ఫార్మా, దివీస్ ల్యాబ్, ఎస్బీఐ లైఫ్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications