Stock Market: బుల్స్ కంట్రోల్‌లో మార్కెట్లు.. పైపైకి పయనిస్తున్న సూచీలు..
Stock Market: బక్రీద్ సెలవు తర్వాత తెరచుకున్న మార్కెట్లు బుల్ జోరును కొనసాగిస్తున్నాయి. వారాంతంతో పాటు వీక్లీ, మంత్రీ డెరివేటివ్ సెటిల్మెంట్ ఉన్నప్పటికీ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఉదయం 9.18 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 362 పాయింట్ల లాభంలో, మరో కీలక సూచీ నిఫ్టీ 101 పాయింట్ల లాభంలో ట్రేడవుతున్నాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 199 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూపీ 165 పాయింట్ల లాభంలో ఇంట్రాడే ట్రేడింగ్ లో కొనసాగుతున్నాయి.

ప్రధానంగా అమెరికా మార్కెట్లలో బ్యాంకింగ్ స్టాక్స్ ర్యాలీ కొనసాగించటం సానుకూల సంకేతాలను అందించింది. అయితే ఆసియా మార్కెట్లలో మాత్రం వడ్డీ రేట్ల పెంపు భయాలు కొనసాగటం వల్ల షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
NSEలో ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, హెక్ మహీంద్రా, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, ఎస్బీఐ లైఫ్, విప్రో, ఓఎన్జీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, యూపీఎల్, ఎల్ టి, టాటా మోటార్స్, హీరో మోటార్స్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.

ఇదే క్రమంలో ఐషర్ మోటార్స్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, హిందాల్కొ, నెస్లే, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా కన్జూమర్, బ్రిటానియా, అపోలో హాస్పిటల్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్లుగా ట్రేడవుతున్నాయి.


Click it and Unblock the Notifications