Stock Market: లాభాల్లోకి దేశీయ స్టాక్ మార్కెట్లు.. అమెరికా మార్కెట్ల నుంచి కీలక మద్ధతు..
Stock Market Opening Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టాయి. వరుస నష్టాలతో ఇన్వెస్టర్లకు భారీ నష్టాలను కలిగించిన సూచీలు నేడు మాత్రం పాజిటివ్ నోట్ లో మెుదలయ్యాయి. కీలక సూచీ అయిన సెన్సెక్స్ ఏకంగా 500 పాయింట్లు ఆరంభంలోనే పెరిగింది.

మార్కెట్లు పెరుగుదలకు కారణం..
ట్రెజరీ ఈల్డ్ తగ్గటం కారణంగా అమెరికా మార్కెట్లు పాజిటివ్ గా ముగిశాయి. ఆ ప్రభావం ఆసియాలోని అన్ని మార్కెట్లపైనా ఉంది. ఈ కారణంగా భారత మార్కెట్లతో పాటు, హ్యాంగ్ స్యాంగ్, తైవాన్ వెయిటెడ్, కోస్పి వంటి సూచీలుసైతం వృద్ధిలో ముందుకు కొనసాగుతున్నాయి. దీనికి తోడు రిజర్వ్ బ్యాంక్ తీసుకుంటున్న చర్యల కారణంగా రూపాయి 35 పైసలు బలపడి ప్రస్తుతం 81.59 వద్ద ఉంది. మరో పక్క డాలర్ బలంగా ఉన్నందున క్రూడ్ ధరలు వరుసగా పతనం అవుతున్నాయి.

సూచీలు ఇలా..
ఉదయం 9.26 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 470 పాయింట్లు లాభంలో ఉండగా, మరో కీలుక బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ 141 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 453 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 302 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి.

గెయినర్స్..
మార్కెట్లు ఫుల్ జోష్ లో ప్రారంభమైన నేపథ్యంలో హిందాల్కొ, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, ఐటీసీ, స్టేట్ బ్యాంక్, కోల్ ఇండియా కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయిర్స్ గా నిలిచాయి.

టాప్ లూజర్స్..
ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, హీరో మోటొకార్ప్, టీసీఎస్, శ్రీ సిమెంట్, హిందుస్థాన్ యూనీలివర్, పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో, నెస్లే ఇండియా షేర్లు ఆరంభంలో నష్టపోయి టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications