Opening Bell: నిన్న లాభాలతో ప్రయాణాన్ని ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు తమ పరుగును ప్రారంభించాయి. వాస్తవానికి అమెరికా మార్కెట్ల సూచీ డౌ జోన్స్ సోమవారం లాభపడటం దేశీయ స్టాక్ మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపుతోంది.
ఉదయం 9.26 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 220 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 48 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 195 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 290 పాయింట్ల మేర లాభంతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది ఇన్వెస్టర్లు ఫెడ్ వడ్డీ రేట్లను ఈ ఏడు తగ్గింస్తుందనే నమ్మకంతో ట్రేడింగ్ చేస్తున్నారు.

ఎన్ఎస్ఈలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందాల్కొ, కోల్ ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్స్, దివీస్ ల్యాబ్, ఎస్బీఐ, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫైనాన్స్, బ్రిటానియా, బజాజ్ ఆటో, రిలయన్స్, ఎల్ టి, సిప్లా, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, ఎయిర్ టెల్, టెక్ మహీంద్రా, బీపీసీఎల్, టాటా మోటార్స్, సన్ ఫార్మా కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో కోటక్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎస్బీఐ లైఫ్, గ్రాసిమ్, ఎన్టీపీసీ, టైటాన్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా కన్జూమర్, నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్, హిందుస్థాన్ యూనీలివర్, ఐషర్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ టిఐఎమ్, విప్రో, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ, టీసీఎస్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ప్రారంభంలో కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications