Stock Market: లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు.. కారణం ఏంటంటే..??
Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్న భారీ ఒడిదొడుకుల మధ్య స్వల్ప నష్టాల్లో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే నేడు ప్రీఓపెనింగ్ సెషన్ నుంచే పాజిటివ్ సైన్ కనిపించింది.
ఉదయం 9.18 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 211 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 63 పాయింట్ల లాభంతో ఇంట్రాడేలో ముందుకెళుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 155 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 122 పాయింట్ల మేర లాభంతో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. నేటి ట్రేడింగ్ ఆరంభంలోనే మిడ్ క్యాప్ సూచీ రికార్డు గరిష్ఠాలకు చేరుకోవటం విశేషం. ప్రధానంగా గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతలు దేశీయ మార్కెట్లను లాభాల్లో నడిపిస్తున్నాయి.

ఎన్ఎస్ఈలో హిందాల్కొ, అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ టిఐఎమ్, టైటాన్, ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా మోటార్స్, రిలయన్స్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హీరో మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ, విప్రో, యూపీఎల్, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఆటో సహా మరిన్ని కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో అపోలో హాస్పిటల్స్, టాటా కన్జూమర్, బజాజ్ ఫైనాన్స్, దివీస్ ల్యాబ్, బ్రిటానియా, ఏషియన్ పెయింట్స్, కోటక్ బ్యాంక్, సిప్లా, ఎల్ టి, పవర్ గ్రిడ్, హిందుస్థాన్ యూనీలివర్, నెస్లే, ఎయిర్ టెల్, సన్ ఫార్మా కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications