Stock Market: బాబు ప్రమాణస్వీకారం.. లాభాల్లో సెన్సెక్స్-నిఫ్టీ.. నష్టపోయిన హెరిటేజ్..
Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో దూసుకుపోతున్నాయి. నేడు ఎన్డీయే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. ప్రధాని నుంచి ప్రపంచ ప్రముఖుల వరకు ఈ కార్యక్రమానికి హాజరుకావటంపై మార్కెట్లు సానుకూలంగా వ్యవహరిస్తున్నాయి.
ఉదయ 9.43 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 355 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో కీలక బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ సూచీ 110 పాయింట్ల లాభంలో ఉన్నాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 133 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 499 పాయింట్ల లాభంతో ఇంట్రాడేలో సరికొత్త జీవితకాల గరిష్ఠాలకు చేరుకుంది. అయితే నేడు ఇంట్రాడేలో 5 శాతం నష్టంతో హెరియేజ్ ఫుడ్స్ స్టాక్ లోయర్ సర్క్యూట్లో రూ.627 ధర వద్ద కొనసాగుతోంది.

ఎన్ఎస్ఈలో టాటా మోటార్స్, బీపీసీఎల్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, ఎల్ టిఐఎమ్, విప్రో, టాటా స్టీల్, ఎల్ టి, ఓఎన్జీసీ, ఎయిర్ టెల్, టెక్ మహీంద్రా, రిలయన్స్, టీసీఎస్, హిందాల్కొ, ఐసీఐసీఐ బ్యాంక్, హీరో మోటార్స్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు నేడు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో టైటాన్, ఏషియన్ పెయింట్స్, బ్రియానియా, ఐటీసీ, టాటా కన్జూమర్, హిందుస్థాన్ యూనీలివర్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications