Stock Market: పవర్ ఫుల్ గా స్టాక్ మార్కెట్లు.. శుభారంభంలో శూచీలు.. వారం ప్రారంభంలో దూకుడు..
Stock Market: ఈ వారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలతో పాటు, భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో వేగంగా ముందుకు సాగటం, బ్రిటన్ ను వెనక్కు నెట్టి తన సత్తాచాటడం వంటి కారణాలు మార్కెట్లను బుల్ జోరుతో ముందుకు సాగేలా చేస్తున్నాయి. జీడీపీ అంచనాలను అందుకోవటంలో వెనకపడినప్పటికీ.. ప్రపంచంలోని అనేక దేశాలకంటే మెరుగైన పనితీరు కనబరచటం మార్కెట్ల సానుకూల పనితూరుకు అద్ధం పడుతున్నాయి.

సూచీలు పైకి..
ఉదయం 10.37 గంటలకు బెచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 348 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 97 పాయింట్లు లాభాలతో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 312 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 122 పాయింట్ల లాభంలో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రధానంగా ఈడీ సోదాల నేపథ్యంలో పేటీఎం కంపెనీ షేర్లు ఏకంగా 4 శాతం నష్టపోయాయి.

టాప్ గెయినర్స్..
హిందాల్కొ, జేఎస్డబ్యూ స్టీల్, హెచ్సీఎల్ టెక్, ఎన్టీపీసీ, కోటక్ బ్యాంక్, సిప్లా, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, టాటా స్టీల్, యూపీఎల్, ఐటీసీ కంపెనీల షేర్లు ఆరంభంలో లాభాలతో టాప్ గెయినర్స్ గా కొనసాగుతున్నాయి.

టాప్ లూజర్స్..
అపోలో హాస్పిటల్స్, ఐషర్ మోటార్స్, పవర్ గ్రిడ్, నెస్టిల్ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో, దివీస్ ల్యాబ్, డాక్టర్ రెడ్డీస్, విప్రో, హెచ్డీఎస్టీ లైఫ్, టాటా మోటార్స్, హీరో మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

తగ్గిన ఫారెక్స్ నిల్వలు..
2021లో రికార్డు స్థాయిలో 642 బిలియన్ డాలర్ల తర్వాత, భారతదేశ కరెన్సీ వార్చెస్ట్ 561 బిలియన్ డాలర్లకు పడిపోయింది. జూలైలో 30 బిలియన్ డాలర్ల నుంచి ఆగస్టులో 28.68 బిలియన్ డాలర్లకు స్వల్పంగా వాణిజ్య లోటు తగ్గింది. అయితే ఆగస్టులో వాణిజ్య లోటు ఎలా ఉంటుంది? అనే ఆందోళనలు కొనసాగుతున్నాయి. వాణిజ్య లోటు లేదా ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం ప్రస్తుతం రికార్డు స్థాయిలోనే ఉంది.


Click it and Unblock the Notifications