Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటి లాభాల ప్రయాణాన్ని నేడు కొనసాగిస్తున్నాయి. ప్రీఓపెన్ సెషన్లోనూ మంచి లాభాలతో ప్రధాన సూచీలు ముందుకు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఉదయం 9.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 369 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 108 పాయింట్ల మేర గెయిన్ అయ్యింది. అలాగే నిఫ్టీ బ్యాంక్ సూచీ 279 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 333 పాయింట్ల మేర లాభాలతో ఇంట్రాడేలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. కంపెనీలు క్యూ2 ఆదాయాలను ప్రకటించటానికి ముందర మార్కెట్లు కోలుకోవటం సానుకూలమైన అంశంగా చెప్పుకోవచ్చు.

ఇక మార్కెట్లను సానుకూలంగా ముందుకు నడిపిస్తున్న ప్రధాన అంశాలను పరిశీలిస్తే..
1. ఫెడరల్ రిజర్వ్ అధికారుల నుంచి డోవిష్ వ్యాఖ్యలు.
2. యూఎస్ డాలర్ 105.73 స్థాయిలకు బలహీనపడింది.
3. అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ రాబడి 4.651%కి తగ్గటం.
4. చమురు ధరలు బ్యారెల్‌కు 86 డాలర్ల కంటే తక్కువగా ఉన్నాయి.
5. చైనా కనీసం 137 బిలియన్ డాలర్ల ఉద్దీపన గురించి ఆలోచిస్తోంది.
6. భారతదేశ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 22% పెరిగి రూ. 9.57 ట్రిలియన్‌లకు చేరుకున్నాయి.
7. ఇదే సమయంలో ఐఎంఎఫ్ భారత జీడీపీ వృద్ధి అంచనాలను పెంచుతూ 6.30 శాతంగా ప్రకటించింది.
NSEలో డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్ బ్యాంక్, యూపీఎల్, ఎల్ టిఐఎమ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ టి, టాటా మోటార్స్, విప్రో, బజాజ్ ఆటో, అదానీ ఎంటర్ ప్రైజెస్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కొ, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అపోలో హాస్పిటల్స్, ఎస్బీఐ, బీపీసీఎల్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో కోల్ ఇండియా, బ్రిటానియా, ఎస్బీఐ లైఫ్ కంపెనీల షేర్లు మాత్రం ఎన్ఎస్ఈలో నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నిలిచాయి. ఇదే క్రమంలో ఈరోజు రెండు త్రైమాసిక ఫలితాలను టెక్ దిగ్గజం టీసీఎస్ ప్రకటించనుందని తెలుస్తోంది. అలాగే షేర్ల బైబ్యాక్ గురించి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉండటంతో కంపెనీ స్టాక్ మార్కెట్లో ఫోకస్‌లో ఉంది.


Click it and Unblock the Notifications