Stock Market: ఊపిరి పీల్చుకున్న బుల్స్.. లాభాల్లో సెన్సెక్స్-నిఫ్టీ.. ట్రెండిగ్‌లో జస్ట్‌డయల్..
Market Opening: వరుస సెషన్లలో నష్టాలను నమోదు చేసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు తిరిగి పుంజుకున్నాయి. శ్రీరామనవమి సెలవు తర్వాత మార్కెట్లు తిరిగి లాభాల బాటపట్టాయి. రాత్రి అమెరికా మార్కెట్లు లాభాల్లో కొనసాగటం నేడు దేశీయ మార్కెట్ల సానుకూల ప్రారంభానికి దారితీసింది.
ఉదయం 9.24 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 320 పాయింట్ల మేర లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 119 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 287 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 366 పాయింట్ల మెగా లాభంతో బుల్ జోరును కొనసాగిస్తున్నాయి. మార్కెట్ల ఆరంభంలో ప్రముఖ బ్రోకరేజ్ ఏంజల్ వన్, జస్ట్ డయల్ కంపెనీల షేర్లు 6-8 శాతం మేర లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.

ఎన్ఎస్ఈలో బీపీసీఎల్, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అదానీ పోర్ట్స్, టాటా కన్జూమర్, బజాజ్ ఆటో, రిలయన్స్, టాటా స్టీల్, హిందాల్కొ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్‌టిఐఎమ్, ఎస్బీఐ, ఎల్‌టి, కోటక్ బ్యాంక్, ఎయిర్ టెల్, హీరో మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, గ్రాసిమ్, అదానీ ఎంటప్ ప్రైజెస్, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని నేడు ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో హెచ్సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే, టెక్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, దివీస్ ల్యాబ్, ఎన్టీపీసీ, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐటీసీ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications