Stock Market: వరుస సెలవుల తర్వాత లాభాల్లో సెన్సెక్స్-నిఫ్టీ..!
Market Opening: వరుస సెలవుల తర్వాత నేడు ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి పుంజుకున్నాయి. బెంచ్ మార్క్ సూచీలు నేడు సానుకూలంగా ట్రేడింగ్ కొనసాగిస్తూ రిలయన్స్ స్టాక్ లాభాల ర్వాలీని కొనసాగిస్తోంది.
ఉదయం 9.29 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ 324 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 101 పాయింట్ల లాభంతో ఉంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 138 పాయింట్లు నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 313 పాయింట్ల మేర లాభంతో ముందుకు సాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు సైతం స్థిరంగానే కొనసాగుతుండటంతో దేశీయ ఇన్వెస్టర్లలో కొనుగోళ్ల జోష్ కొనసాగుతోంది.

ఎన్ఎస్ఈలో రిలయన్స్, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, మారుతీ, ఓఎన్జీసీ, హిందుస్థాన్ యూనీలివర్, ఐషర్ మోటార్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హిందాల్కొ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, కోటక్ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, టైటాన్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ప్రస్తుతం కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో యూపీఎల్, అపోలో హాస్పిటల్స్, ఇన్ఫోసిస్, విప్రో, టాటా కన్జూమర్, దివీస్ ల్యాబ్, జేఎస్డ్యూ స్టీల్, హీరో మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ఇంట్రాడేలో కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications