Stock Market Opening Bell: గత రెండు రోజులుగా కొనసాగుతున్న బుల్ జోరుకు బ్రేక్ పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ఓపెన్ అయినప్పటికీ.. స్వల్ప నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రధానంగా వడ్డీ రేట్ల పెంపు భయాలతో నిన్న అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియటంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపైనా పడింది.

ఊగిసలో సూచీలు..
ఉదయం 9.25 గంటలకు స్టాక్ మార్కెట్లోని బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 12 పాయింట్ల నష్టంలో కొనసాగుతుండగా, మరో కీలక సూచీ నిఫ్టీ 7 పాయింట్ల నష్టంలో ఉంది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ మాత్రం భారీ నష్టాన్ని చవిచూసి ఏకంగా 152 పాయింట్లను కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ మాత్రం 205 పాయింట్ల లాభంతో ఉంది. అయితే ఈ స్వల్ప నష్టాల నుంచి మార్కెట్లు కోలుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు. హై ఓలటాలిటీ కారణంగా చివరికి ఫ్లాట్ గా ముగిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గెయినర్స్..
హిందుస్థాన్ యూనిలివర్, హీరోమోటొ కార్ప్, మహీంద్రా అండ్ మహీంద్రా, నెస్టిల్ ఇండియా, బ్రిటానియా, ఐషర్ మోటార్స్, టాటా స్టీల్, మారుతీ, సన్ ఫార్మా, టాటా కన్జూమర్, కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ కంపెనీల షేర్లు ప్రధానంగా ఆరంభంలో లాభాలతో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.

లూజర్స్..
మార్కెట్ల ఆరంభంలో ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్, ఓఎన్జీసీ, యూపీఎల్, గ్రాసిమ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టీసీఎస్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, శ్రీ సిమెంట్, విప్రో, హెచ్సీఎల్ టెక్ షేర్లు నష్టపోయి టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications