Opening Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ప్రారంభమైన తర్వాత నేడు ఫ్లాట్ ప్రారంభాన్ని నమోదు చేశాయి. ఈ క్రమంలో కీలక సూచీలు నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి.
ఉదయం 9.23 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 75 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 22 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 44 పాయింట్ల మేర నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. అయితే మిడ్ క్యాప్ నిఫ్టీ మాత్రం 2 పాయింట్ల స్వల్ప లాభంలో ట్రేడవుతోంది.

ప్రధానంగా అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడింగ్ ముగించటంతో పాటు క్యూ1 కార్పొరేట్ ఫలితాలు మార్కెట్లను ముందుకు నడిపిస్తున్నాయి. శుక్రవారం అంచనాలను మిస్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ తో పాటు కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ మార్కెట్లను నష్టాల్లోకి లాగుతున్నాయి. ఇదే సమయంలో ఆసియా మార్కెట్లు సైతం మిశ్రమంగా ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఇన్వెస్టర్లు బలమైన సంకేతాల కోసం ఎదురుచూస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
NSEలో ఎల్ టి, ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్డీఎఫ్సీ లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్, టాటా మోటార్స్, గ్రాసిమ్, ఎల్ టిఐఎమ్, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, హెచ్సీఎల్ టెక్, అదానీ ఎంటర్ ప్రైజెస్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా ఇంట్రాడేలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందుస్థాన్ యూనీలివర్, ఐషర్ మోటార్స్, టాటా స్టీల్, టైటాన్, ఎయిర్ టెల్, నెస్లే, బ్రిటానియా, పవర్ గ్రిడ్, మారుతీ, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్, హిందాల్కొ, హీరో మోటార్స్, ఎన్టీపీసీ, సన్ ఫార్మా కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా ఉన్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications