Stock Market: ఈరోజు హుషారుగా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటి లాభాల బాటను కొనసాగించాయి. ప్రీ ఓపెనింగ్ సెషన్లో లాభాల ఆరంభంతో ఇన్వెస్టర్లలో జోష్ నింపాయి. ప్రధానంగా బ్యాంకింగ్ సంస్థలు మంచి లాభాలను ప్రకటించటం దీనికి కారణంగా తెలుస్తోంది.
ఉదయం మార్కెట్ల ప్రారంభ సమయంలో దేశీయ బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 79 పాయింట్ల లాభంలో ప్రారంభం కాగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 18 పాయింట్ల లాభాలతో కొనసాగుతోంది. అయితే ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 95 పాయింట్ల లాభంలో, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 14 పాయింట్ల లాభంలో నిలిచాయి. అయితే ఈ లాభాలు క్షణాల్లోని ఆవిరై కీలక సూచీలు స్వల్ప నష్టాల్లోకి జారుకున్నాయి.

అమెరికా మార్కెట్లు మిశ్రమంగా స్పందించిన వేళ.. ఆసియాలోని ఇతర మార్కెట్లు అదే దోరణిని అనుకరిస్తున్నాయి. దీంతో నేడు ఆసియా మార్కెట్లు ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నాయి. అయితే ఇన్వెస్టర్లు ప్రధానంగా కంపెనీలు విడుదల చేస్తున్న క్యూ4 ఫలితాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. అయితే ఆసియా మార్కెట్లలోని నెగటివ్ సెంటిమెంట్లు భారత మార్కెట్లను సైతం ఆవరించటంతో మార్కెట్లు కొద్ది క్షణాల్లోని నష్టాల్లోకి వెళ్లాయి.
NSE సూచీలో ఇండస్ ఇండ్ బ్యాంక్, హీరో మోటార్స్, మారుతీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, టాటా స్టీల్, ఐషర్ మోటార్స్, బ్రిటానియా, బజాజ్ ఫిన్ సర్వ్, రిలయన్స్, హిందాల్కొ, గ్రాసిమ్, బజాజ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ కంపెనీల షేర్లు లాభాల్లో నిలిచి టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.
యూపీఎల్, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, కోటర్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హిందుస్థాన్ యూనీలివర్, ఏషియన్ పెయింట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, నెస్లే, ఎస్బీఐ లైఫ్, సన్ ఫార్మా, అపోలో హాస్పిటల్స్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ, టైటాన్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications