Stock Market: ఒడిదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు.. ఫ్లాట్‌గా నిఫ్టీ, సెన్సెక్స్ ట్రేడింగ్..
Stock Market: కొత్త వారం దేశీయ స్టాక్ మార్కెట్ల ప్రయాణం తీవ్రఒడిదొడుకుల మధ్య ప్రారంభమైంది. మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్లు ఆచితూచి ప్రయాణం కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఉదయం 9.30 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 26 పాయింట్ల నష్టంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 4 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 20 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 94 పాయింట్ల లాభంలో ఉంది. ప్రస్తుతం మార్కెట్లు ఫ్లాట్ నోట్ లో ఇంట్రాడే ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.

ప్రధానంగా ఇన్వెస్టర్ల చూపు నేడు జరగనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎంపైనే ఉంది. ఇదే క్రమంలో బ్లాక్ డీల్స్ నేపథ్యంలో జొమాటో కంపెనీ షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. భారత సంస్థాగత మదుపరుల పెట్టుబడులు ఈ ఏడాది ఇతప్పటికే లక్ష కోట్ల రూపాయల మార్కును చేరుకున్నాయి.
ఎన్ఎస్ఈలో సిప్లా, అదానీ ఎంటర్ ప్రైజెస్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ టి, టాటా స్టీల్, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఆటో, ఎస్బీఐ లైఫ్, ఎన్టీపీసీ, మారుతీ, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటార్స్, ఓఎన్జీసీ, విప్రో, ఐటీసీ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఇంట్రాడేలో హెచ్సీఎల్ టెక్నాలజీస్, డాక్టర్ రెడ్డీస్, బ్రిటానియా, హిందాల్కొ, నెస్లే, ఎయిర్ టెల్, హిందుస్థాన్ యూనీలివర్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎల్ టిఐఎమ్, అపోలో హాస్పిటల్స్, జియో ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇండస్ఇండ్ బ్యాంక్, దివీస్ ల్యాబ్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications