Stock Market: ఒత్తిడిలో స్టాక్ మార్కెట్లు.. ఫ్లాట్‌గా ట్రేడింగ్ కొనసాగిస్తున్న నిఫ్టీ, సెన్సెక్స్..
Stock Market: కొత్త వారం ప్రీమార్కెట్ సెషన్లో స్వల్ప లాభాలు నమోదు చేసిన సూచీలు మార్కెట్లో ప్రస్తుతం స్థబ్దుగా ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
ఉదయం 9.40 గంటల సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 43 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 10 పాయింట్ల మేర లాభంలో ట్రేడవుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 17 పాయింట్ల నష్టంలో ట్రేడవుతుండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 103 పాయింట్ల లాభంలో ఉంది.

ఎన్ఎస్ఈలో ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కొ, టీసీఎస్, గ్రాసిమ్, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, విప్రో, అదానీ ఎంటర్ ప్రైజెస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా, ఎల్ టిఐఎమ్, బీపీసీఎల్, హీరో మోటార్స్, యాక్సిస్ బ్యాంక్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో అపోలో హాస్పిటల్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బ్రిటానియా, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, ఎయిర్ టెల్, ఐషర్ మోటార్స్, ఐటీసీ, సన్ ఫార్మా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హిందుస్థాన్ యూనీలివర్, ఐసీఐసీఐ బ్యాంక్, సిప్లా, ఎస్బీఐ లైఫ్, దివీస్ ల్యాబ్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా కన్జూమర్, ఎల్ టి, టైటాన్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications